September 25, 2018

Breaking News

డీఎస్‌కు కేసీఆర్ ఝలక్.!

డీఎస్‌కు కేసీఆర్ ఝలక్.!

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ, మాజీ మంత్రి డి. శ్రీనివాస్‌‌కు ఝలక్ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొదటగా భావించిన ప్రకారం ఈ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ని డీఎస్ కలవాల్సి ఉంది. నిజామాబాద్‌ ఎంపీ కవితతో పాటు ఆ పార్టీ నేతలు డీఎస్‌పై పలు విమర్శలు చేసిన నేపథ్యంలో వీరి భేటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది కూడా. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు నిజామాబాద్ నేతలు లేఖ రాసిన నేపథ్యంలో సీఎంతో భేటీ అనంతరం డీఎస్ పార్టీ వీడతారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.

మరోవైపు, టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి, డీఎస్ కాంగ్రెస్ గూటికి వెళ్లతారన్న వార్తలూ ప్రముఖంగా వినిపించాయి. అయితే, కేసీఆర్.. డీఎస్‌కు తనతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సీఎం అపాయొంట్‌మెంట్‌ కోసం ఈ సాయంత్రం వరకు డీఎస్‌ ఎదురుచూసినప్పటికీ అపాయింట్‌మెంట్‌ లేదని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. రేపు సీఎం అందుబాటులో ఉంటే చెబుతామని డీఎస్‌కు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. రేపైనా కేసీఆర్ కలిసిమాట్లాడేందుకు ఇష్టపడతారా లేదా అన్నది చూడాలి.

Related posts