November 17, 2018

Breaking News

జర్నలిస్ట్ బుఖారీని చంపినోడు వీడే

జర్నలిస్ట్ బుఖారీని చంపినోడు వీడే

జమ్మూ కాశ్మీర్‌లో జర్నలిస్ట్..‘ రైజింగ్ కాశ్మీర్’ ఎడిటర్ షుజాత్ బుఖారీని కాల్చి చంపిన ముగ్గురిలో ఒకడు పాకిస్తానీ టెర్రరిస్ట్ నవీద్ జట్ అని తెలిసింది.

ఈ ఉగ్రవాదిని ఈ ఏడాది ఫిబ్రవరిలో మెడికల్ చెకప్ కోసం శ్రీనగర్ జైల్లోని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా నాటకీయంగా తప్పించుకుని పారిపోయాడు. పాక్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే-తోయిబా ఆదేశాలపై ఇతగాడు బుఖారీని హతమార్చినట్టు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు.

ఈద్ సందర్భంగా ఈ నెల 14న షుజాత్ బుఖారీ తన ఆఫీసు నుంచి బయటకు వచ్చి ఇఫ్తార్ పార్టీకి వెళ్లబోతుండగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఆయనతో బాటు మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా హతమయ్యారు. దుండగులు బుఖారీపై 17 బులెట్లు కురిపించారు. ఉగ్రవాది నవీద్ జట్ జైలు నుంచి తప్పించుకుని పారిపోగా..సెక్యూరిటీ లోపాలే ఇందుకు కారణమని, ఇందుకు బాధ్యుడ్ని చేస్తూ జైలు ఉన్నతాధికారి ఎస్.కె.మిశ్రాకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది.

Related posts