November 17, 2018

Breaking News

చరిత్ర పుస్తకంలో ప్రవక్త ఫోటో…

చరిత్ర పుస్తకంలో ప్రవక్త ఫోటో…

ముస్లిములకు క్షమాపణలు చెప్పిన ప్రచురణకర్త
అహ్మదాబాద్ : భారత చరిత్ర పుస్తకంలో ముహమ్మద్ ప్రవక్త ఫోటో ప్రచురించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో సంచలనం రేపింది. పోటీ పరీక్షలకు చదివే విద్యార్థుల కోసం భారతదేశ చరిత్రను ‘భారత్ నో ఇతిహాస్’ పేరిట అహ్మదాబాద్ నగరానికి చెందిన లిబర్టీ పబ్లికేషన్స్ ఓ పుస్తకాన్ని ప్రచురించింది. ఆ పుస్తకంలో ప్రవక్త ముహమ్మద్ అంటూ ఓ ఫోటోను ప్రచురించడం వివాదాస్పదంగా మారింది. ప్రవక్త ముహమ్మద్ ఫోటో ఉండదని, ప్రవక్తదంటూ ఫోటో ప్రచురించడం తమ మనోభావాలను దెబ్బతీసిందని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ముస్లిమ్ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. దీంతో లిబర్టీ పబ్లికేషన్స్ ప్రచురణకర్త జగదీష్ పటేల్ ముస్లిములకు క్షమాపణలు చెప్పారు. ప్రవక్త ఫోటో ఉండదనే విషయం తెలియక ఇంటర్ నెట్ నుంచి పొరపాటున ఏదో ఫోటోను ప్రచురించామని క్షమించాలని జగదీష్ పటేల్ కోరారు. అసలు ప్రవక్త ముహమ్మద్ ఫోటోనే ఉండదని అలాంటపుడు ఈ ఫోటో ఎలా ప్రచురించారని మైనారిటీ సమన్వయ సమితి కన్వీనర్ ముజాహిద్ నఫీజ్ ప్రశ్నించారు. ప్రచురణ కర్త క్షమాపణలు చెప్పినందు వల్ల తాము దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని ముజాహిద్ వివరించారు.

Related posts