November 17, 2018

Breaking News

కర్నూలులో కానిస్టేబుల్‌ రాసలీల

కర్నూలులో కానిస్టేబుల్‌ రాసలీల

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు
సహచర కానిస్టేబుళ్ల సహాయంతో పరారీ
ఆ కానిస్టేబుల్‌ బీట్‌ పుస్తకం పట్టుకొని గ్రామాల్లో తిరగాలి.. గ్రామాల్లో తిరిగేందుకని స్టేషన్‌లో సంతకం చేసి బయటకు వచ్చాడు. తీరా చూస్తే ప్రియురాలితో రాసలీలల్లో మునిగిపోయాడు. కాలనీవాసులు కానిస్టేబుల్‌ను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత సహచర కానిస్టేబుళ్ల సాయంతో తప్పించుకున్నాడు. కర్నూలు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఓ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ బుధవారం ఉదయం స్టేషన్‌లో సంతకం చేసి బీట్‌ కోసం వెళ్లాడు. స్థానిక రాజీవ్‌ గృహకల్పకు ఓ మహిళతో చేరుకొని తన ఇంట్లో రాసలీలలు మొదలు పెట్టాడు.

స్థానికులు గుర్తించి కానిస్టేబుల్‌ను ఇంట్లో పెట్టి పోలీసులకు సమాచారం అందించారు. గతంలో కూడా ఈ కానిస్టేబుల్‌ పలువురు మహిళలతో ఇక్కడకు వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు. ఓ సారి ఇళ్లు శుభ్రం చేయడానికి, మరోసారి పనిమనిషి అని ఇలా చెప్పి తప్పించుకునేవాడని స్థానికులు చెబుతున్నారు. వచ్చిన రెండు గంటలకల్లా పని ముగించుకుని వెళ్లిపోయేవాడని వారు తెలిపారు. తమకు ఎలాంటి సమాచారం అందలేదని నాలుగో పట్టణ పోలీసులు చెబుతున్నారు.

Related posts