September 25, 2018

Breaking News

ఏటీఎంలో ఎలకలు !

ఏటీఎంలో ఎలకలు !

అవును.. ఏటీఎంలో ఎలకలు పడ్డాయి..! గురిచూసి ఏటీఎంలోపలికి చొరబడి డబ్బు కట్టలుండే ప్రాంతానికి చేరుకొని.. ఇష్టారాజ్యంగా దాడిని షురూ చేశాయి. ఎంత గట్టి వస్తువునైనా ఇట్టే తుంచిపారేసే గట్టి పళ్ళుండే ఈ ఎలుకలు.. అవి అత్యంత విలువైన రెండువేల నోట్లన్న కనీస గౌరవం లేకుండా చీలికలు పీలికలు చేసి చెండాడేశాయి. ఎలుకలా.. మజాకానా అని ముక్కున వేలేసుకునేలా తమ ప్రతాపం చూపేశాయి. ఇందులో నిజమెంతో తెలీదు గానీ.. అసోంలోని తిన్సుకియా పట్టణంలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటన.. సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. మన దేశంలో కనీస వసతులు, మినిమమ్ మెయింటెనెన్స్ లేని కొన్ని వేలాది ఏటీఎంలలో ఇటువంటి ‘ప్రమాదం’ ఖచ్చితంగా పొంచి వుంది.

Related posts