September 25, 2018

Breaking News

అమెరికా జైళ్లలో 900 మంది భారతీయులు

అమెరికా జైళ్లలో 900 మంది భారతీయులు

అక్రమ వలసదారుల వివాద సెగ భారతీయులను కూడా బలంగానే తాకింది. అమెరికాలోని రెండు నిర్బంధ కేంద్రాల్లో దాదాపు 100 మంది భారతీయ అక్రమ వలసదారులున్నట్లు గుర్తించారు. న్యూ మెక్సికో రాష్ట్రంలోని కేంద్రంలో 45-50 మంది ఉండగా వీరిలో ఎక్కువ మంది పంజాబీలున్నారు. ఓరెగాన్‌లో ఉన్న 52 మందిలో క్రైస్తవులు, సిక్కులున్నారు. స్వదేశంలో తాము హింసనీ, అణచివేతనీ ఎదుర్కొంటున్నామనీ, తమకు ఆశ్రయం కల్పించాలని వీరు అర్థిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నిర్బంధ కేంద్రాలను భారత రాయబార కార్యాలయ అధికారులు సందర్శించారు. అమెరికా అధికారులతో మాట్లాడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు దౌత్యవర్గాలు తెలిపాయి.

‘‘2013, 14, 15- మూడు సంవత్సరాల్లో దాదాపు 27,000 మంది భారతీయులు అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తూ సరిహద్దుల్లోనే అరెస్టయ్యారు… ఇప్పటికీ జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో 4000 మంది మహిళలు కాగా, 350 మంది పిల్లలు. 2015లో అమెరికా సమాచార హక్కు చట్టం ప్రకారం 900 మంది భారతీయులు జైళ్లలో ఉన్నారు. అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర 35-40 లక్షలు వసూలు చేసి చివరకిలా జైలు పాల్జేస్తున్న సంస్థలెన్నో ఉన్నాయి’’ అని ఉత్తర అమెరికా పంజాబీ సంఘం (ఎన్‌ఎపీఎ) ప్రతినిధి సత్నామ్‌సింగ్‌ చాహల్‌ చెప్పారు.

Related posts