September 25, 2018

Breaking News

అమెరికా ఎన్నికలు.. తాజా పరిస్థితులు!

అమెరికా ఎన్నికలు.. తాజా పరిస్థితులు!

3అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తాజా పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల ప్రచారం మొదలైనప్పటినుంచీ వివిద సర్వేల ప్రకారం వెనుకబడి చివరి పది రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయానికి ఎంత దూరంలో ఉన్నాడు? మొదటి నుంచీ ఆధిక్యంలో కొనసాగుతోన్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయం దాదాపు ఖరారైపోయినట్లేనా? లేక.. చివరి నిమిషంలో అనూహ్యమార్పులేమైనా చోటుచేసుకుంటాయా? అమెరికా సహా ప్రపంచమంతటా ఉత్కంఠ రేపుతోన్న ఈ శ్వేతసౌధ పోరుకు సంబందించి కొన్ని కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి!

అమెరికా అధ్యక్ష ఎన్నికల తాజా పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలపై ప్రఖ్యాత వార్తా సంస్థ సీ.ఎన్.ఎన్. తాజాగా (శుక్రవారం రాత్రి నాటికి) సేకరించిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే… ఇప్పటివరకూ హిల్లరీకి స్పష్టమైన ఆధిక్యం లభించిందనే చెప్పాలి. ప్రజలు ఓట్లు వేసి గెలిపించే అమెరికా ఎలక్టోరల్ కాలేజీ అధ్యక్షుణ్ని ఎన్నుకుంటుందని ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉండగా మెజారిటీ (270) ఓట్లు సాధించిన అభ్యర్థి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారనే విషయం తెలిసిందే. అయితే తాజా వివరాల ప్రకారం హిల్లరీ ఖాతాలో 268 ఓట్లుండగా… ట్రంప్ కు 204 ఎలక్టోరల్ ఓట్లు పడటం ఖాయంగా తేలింది.

అయితే హిల్లరీ ఇప్పటివరకూ 17 రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని మరో 5 రాష్ట్రాల్లో అనుకూలతను సంపాదించగా… 20 రాష్ట్రాల్లో గట్టి పట్టును సాధించిన రిపబ్లికన్ పార్టీ (ట్రంప్) మరో 5 రాష్ట్రాల్లో అనుకూలతను సాధించింది. అంటే… ప్రస్తుత పరిస్థితి ప్రకారం ఊహించని పరిణామాలు తలెత్తితేతప్ప అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా హిల్లరీ గెలుపొందడం దాదాపు ఖరారయినట్లే. కానీ.. ట్రంప్ కూడా రోజు రోజుకీ అత్యంత వేగంగా దూసుకొస్తున్నాడు. అయితే… మంగళవారం (నవంబర్ 8) నాటి పోలింగ్ కు ముందు కొన్ని గంటల వ్యవధిలో పరిస్థితి మారిపోయినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఈ విషయంలో మంగళవారం జరగనున్న ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ అన్నింటిలోనూ నెగ్గుకొస్తే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశాలున్నాయి!!

ఎందుకంటే… అమెరికాలోని చాలా రాష్ట్రాల ఓటర్లు ఇప్పటికే రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీలో ఏదో ఒకదానికి మొగ్గు చూపగా మంగళవారం ఓటింగ్ జరగనున్న ఈ ఆరు రాష్ట్రాల్లో మాత్రం హోరాహోరీ పోరు సాగనుంది. ఈ ఆరు రాష్ట్రాల వివరాలు చూస్తే… ఫ్లోరియా (29 ఎలక్టోరల్ ఓట్లు) – ఆరిజోనా (11) – నెవెడా (6) – నెబ్రాస్కా రెండో సభ (1) – న్యూహాంప్ షైర్ (4) – నార్త్ కరోలినా (15) గా ఉన్నాయి. ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ప్రస్తుత గణాంకాలను ప్రకారం ఈ ఆరింటిలో ఏ ఒక్కచోట గెలిచినా హిల్లరీ వైట్ హౌస్ రేసును దాదాపు గెలిచినట్లే కానీ ఈ ఆరింటిలోనూ గెలిస్తే తప్ప ట్రంప్ కు ఆ అవకాశం లేదు!!

పోలింగ్ తేదీ (మంగళవారం ఉదయం) నాటికి పరిస్థితులు తారుమారవుతాయా.. ఇలానే కొనసాగుతాయా అనేది మాత్రం వేచి చూడాల్సిందే!!

Related posts